మెటా సంస్థ నుంచి సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ మ్యూజ్

రిపోర్టర్: సతీష్ స్థలం: World

మెటా సంస్థ సరికొత్త ఏఐ ఏజెంట్ మ్యూజ్‌ను లాంఛ్ చేసింది. ఇది వినియోగదారుల రోజువారీ పనులను స్వయంగా చక్కబెట్టడంతో పాటు చెల్లింపులు కూడా చేయగలదు. వాట్సాప్, ప్రత్యేక యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుంది. డేటా సెక్యూరిటీ కోసం ప్రత్యేక ప్రైవేట్ వర్చువల్ కంప్యూటర్ సిస్టమ్‌ను వాడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీస్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించనుంది.