పోలీసు విధుల్లో క్రమశిక్షణ నిజాయితీ మానవత్వం ముఖ్యం అని మంత్రి అనిత స్పష్టీకరణ

రిపోర్టర్: విజయ్ స్థలం: గుంటూరు

ఆంధ్రప్రదేశ్ మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో నిర్వహించిన కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ను రూ. 4,500 నుంచి రూ. 12,500కు పెంచినట్లు తెలిపారు. యూనిఫాం ప్రజలలో భయాన్ని కాకుండా భద్రతా భావాన్ని కలిగించాలని సూచించారు.