ఇథనాల్ ఆరోపణలు నిరాధారమంటూ కర్ణాటక ప్రభుత్వ వాదనను ఖండించిన కేంద్ర పెట్రోలియం శాఖ
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమంపై కర్ణాటక ప్రభుత్వ ఆరోపణలు నిరాధారమని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పష్టం చేసింది. తనిఖీల్లో నిబంధనలు పాటించలేదని, శాంపిల్స్ సేకరణ ఏకపక్షంగా సాగిందని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పరీక్షించిన నమూనాలలో ప్రమాణాలు సక్రమంగానే ఉన్నాయని చమురు సంస్థలు పేర్కొన్నాయి. ఆరోపణలలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్రం తేల్చిచెప్పింది.