యాదాద్రి పవర్ ప్లాంట్ పరిశీలనకు ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల నియామకం

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను క్షేత్రస్థాయి పరిశీలనకు నియమించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. ప్లాంట్లో బొగ్గు వినియోగం, యూనిట్ల పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని ఆయన పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన చీఫ్ ఇంజనీర్ బి.సురేష్ను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.