రణబాలి రివ్యూ: విజయ్ దేవరకొండ పిరియాడికల్ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ పిరియాడికల్ చిత్రం రణబాలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చారిత్రక చిత్రంలో విజయ్ దేవరకొండ నటన, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని, అయితే మితిమీరిన హింస కాస్త ఇబ్బంది పెడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.