చింతగూడలో మహిళా సాధికారతే లక్ష్యంగా ముస్తాబైన నూతన ఐకేపీ భవనం

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

జన్నారం మండలంలోని చింతగూడ గ్రామంలో ఐకేపీ మహిళా గ్రూపు భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పది లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఈ నిధులతో భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేశామని సర్పంచ్ సుతారి సుమలత వినయ్ తెలిపారు. త్వరలోనే ఈ నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.