టీమిండియా జట్టు ఎంపిక విమర్శలపై స్పందించిన ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో యువ ఆటగాళ్ల ఎంపికపై వస్తున్న విమర్శలపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. జట్టుగా నిర్మించామని, జట్టుగా గెలిచామని, ఎప్పుడూ భారతదేశం కోసమేనంటూ ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. వ్యక్తిగత ప్రదర్శనల కంటే జట్టు విజయమే ముఖ్యమనే సందేశాన్ని ఆయన ఇచ్చారని అభిమానులు భావిస్తున్నారు. సిరీస్ లో వైభవ్ సూర్యవంశీకి పరిమిత అవకాశాలు దక్కడంపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.