కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత: కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసుల లాఠీఛార్జ్

రిపోర్టర్: సునీల్ స్థలం: కుప్పం

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు ఆరోపించారని పోలీసులు తెలిపారు. తమను బలవంతంగా బయటకు పంపించారని నిరసనకు దిగిన శ్రేలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. కౌంటింగ్ పారదర్శకంగా జరగడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేయగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.