వైసీపీ హయాంలో పెట్టిన దొంగ కేసులన్నీ ఎత్తేస్తాం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Andhra Pradesh

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన దొంగ కేసులన్నింటినీ పూర్తిగా ఎత్తేస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ఎవరిపైనైనా ఇలాంటి తప్పుడు కేసులుంటే వెంటనే పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. అలాగే ఎవరికైనా పెండింగ్ బిల్లులు ఉంటే వివరాలు అందజేయాలని, వాటిని పూర్తిగా క్లియర్ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో కేసులు మరియు బిల్లుల గురించి మాట్లాడితే మాత్రం ఒప్పుకోమని ఆయన హెచ్చరించారు.