మిత్రధర్మానికి కట్టుబడి ఉండాలి: స్థానిక ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

కూటమి పార్టీల మధ్య మిత్రధర్మం విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి స్థానంలోనూ కూటమి అభ్యర్థుల విజయం కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. అగ్రనేతల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరి పనితీరును పరిశీలిస్తున్నామని, మిత్రధర్మాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.