రజక కార్పొరేషన్ చైర్మన్ను కలిసిన రాజాపేట నేతల బృందం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల కేంద్రానికి చెందిన రజక నాయకుల బృందం రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ దాసరిరాజు అజయ్ కుమార్ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాజాపేటకు రావాలని ఆహ్వానించడంతో పాటు, రజకులకు ప్రత్యేక నిధులు అందేలా కృషి చేయాలని కోరారు. చైర్మన్ సానుకూలంగా స్పందించడంతో నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐరేని కుమార్, పుల్లంగారి పోచయ్య, పుల్లంగారి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.