వైకాపా అరాచకాలను ఉపేక్షించేది లేదంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు దిశానిర్దేశం చేసిన ఆయన, రాజకీయ నాయకుల ముసుగులో అసాంఘిక శక్తులు విధ్వంసానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. బెంగళూరులో కూర్చుని జగన్ రౌడీ గ్యాంగ్‌తో అరాచకాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే వారిపై రైల్వే యాక్ట్ తరహాలో కఠిన చట్టం తెస్తామని హెచ్చరించారు.