లండన్ పర్యటనకు వెళ్లిన కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి
రిపోర్టర్: మదన్ రాయల్
స్థలం: తిరుపతి అర్బన్
సత్యవేడు నియోజకవర్గం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కురపాటి శంకర్రెడ్డి సొంత పనుల నిమిత్తం లండన్ పర్యటనకు వెళ్లారు. వ్యక్తిగత పనుల కారణంగా ఆయన కొంతకాలం పాటు లండన్లోనే పర్యటించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ పర్యటన ముగిసిన వెంటనే ఆయన తిరిగి నియోజకవర్గానికి చేరుకుని, యథావిధిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.