భారీ వర్షాల బీభత్సం: ములకలపల్లి మండలంలో పూర్తిగా స్తంభించిన జనజీవనం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ములకలపల్లి
ములకలపల్లి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా ములకలపల్లిలో 231.8 మి.మీ., దమ్మపేటలో 214.3 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఎస్సై మధు ప్రసాద్ హెచ్చరించగా, పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఎంఈఓ సత్యనారాయణ తెలిపారు.