లండన్ థేమ్స్ నదిలో వినాయక నిమజ్జనంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: లండన్
లండన్లోని థేమ్స్ నదిలో వినాయక విగ్రహ నిమజ్జనం చేయడంపై నీలాంజన హజారికా వర్మ అనే భారతీయ మహిళ సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంస్కృతి పేరుతో విదేశాల్లోనూ పర్యావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో మన ఆచారాలను పాటించేటప్పుడు స్థానిక నిబంధనలు, పర్యావరణ పరిరక్షణను విస్మరించకూడదని ఆమె హితవు పలికారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, నెటిజన్లు భిన్న రీతిలో స్పందిస్తున్నారు.