ప్రేమకు అడ్డొస్తోందని ప్రియురాలి అక్కపై హత్యాయత్నం
రిపోర్టర్: కిరణ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో ప్రేమ వ్యవహారం ఘర్షణకు దారితీసింది. చెల్లెలితో ప్రేమకు అడ్డు వస్తోందన్న కక్షతో ప్రియురాలి అక్కపై యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. గదిలోకి చొరబడి ముఖంపై దాడి చేసి, షూ లేస్‌తో మెడకు బిగించి పరారయ్యాడు. మదనపల్లిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.