సౌరవ్ దాస్ నేపథ్యంపై సమగ్ర విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశం
రిపోర్టర్: శివ
స్థలం: చెన్నై
కాక్రోచ్ జనతా పార్టీ నేత సౌరవ్ దాస్ గుర్తింపు మరియు నేపథ్యంపై సమగ్ర విచారణ జరపాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. సౌరవ్ దాస్‌పై మోపబడిన ఆరోపణలు నిజమని తేలితే ఆయన పాస్‌పోర్ట్, ఆధార్ కార్డులను తక్షణమే రద్దు చేయాలని సదరు పిటిషన్లో కోరారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి, పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించడంతో ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.