ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపడుతున్న మౌలిక వసతులు ఆకర్షణీయంగా మార్పు

రిపోర్టర్: gourinatha p.g స్థలం: జన్నారం

జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పాఠశాలలకు సున్నం వేయించి, మౌలిక వసతులను మెరుగుపరుస్తోంది. ముఖ్యంగా అక్కపల్లి గూడా పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ మార్పులు విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ, ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని మరింతగా పెంచుతున్నాయి.