టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకం చెల్లదన్న టాటా ట్రస్ట్స్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ముంబై

టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామకంపై వివాదం చెలరేగింది. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం టాటా ట్రస్ట్స్ నామినీ డైరెక్టర్ల నుంచి స్పష్టమైన మద్దతు లభించనందున సెప్టెంబర్ 17 నాటి తీర్మానం చెల్లదని టాటా ట్రస్ట్స్ స్పష్టం చేసింది. బోర్డు సమావేశంలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా వ్యతిరేకించగా, మరో నామినీ వేణు శ్రీనివాసన్ మద్దతు తెలిపారని, మెజారిటీ నిబంధన నెరవేరనందున ఈ నియామకం చట్టవిరుద్ధమని ట్రస్ట్స్ వాదించింది.