చెంగనపల్లిలో చెలరేగిన భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసిన వైనం

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఐరాల

ఐరాల మండలం చెంగనపల్లి గ్రామంలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రామచంద్రయ్య కుటుంబానికి చెందిన భూమి విషయంలో రామకృష్ణ, సతీష్లు దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనపై తక్షణమే రెవెన్యూ మరియు పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి, తమకు న్యాయం చేయాలని బాధితుల కుటుంబం కోరుతోంది. స్థానికంగా ఈ వివాదం కలకలం రేపింది.