యువ నటీనటులతో తెరకెక్కుతున్న మైలురాయి చిత్రం: ఆవిష్కరించిన నటుడు నాగబాబు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల జంటగా రఘువర్ధన్ కోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైలురాయి సినిమా టైటిల్‌ను సీనియర్ నటుడు నాగబాబు ఇటీవల ఆవిష్కరించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కర్మ రిటర్స్న్ ఉపశీర్షికతో హన్సిక పెద్దిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని, షూటింగ్ పూర్తయి ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని దర్శకుడు తెలిపారు. ఎమోషనల్ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.