ప్రాణాపాయ స్థితిలో బాలిక.. ఆదుకోవాలని కలెక్టరేట్ ఎదుట తండ్రి వేడుకోలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: నెల్లూరు

నెల్లూరు వైఎస్సార్‌నగర్‌కు చెందిన కర్రి ఆదినారాయణ కుమార్తె తేజస్విని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులు భరించలేక, తమను ఆదుకోవాలని కోరుతూ బాలిక తండ్రి కాలనీవాసులతో కలిసి నెల్లూరు కలెక్టరేట్‌లో అధికారులను వేడుకున్నారు.