పద్మనాభస్వామి ఆలయంలో అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కరణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరువనంతపురం
కేరళలోని ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో ఈక్వినాక్స్ సందర్భంగా అస్తమిస్తున్న సూర్యుడు ఆలయ గోపురం కిటికీల గుండా కనిపించే అరుదైన ఖగోళ విన్యాసం ఆవిష్కృతమైంది. ఈ అద్భుత శిల్పకళా నైపుణ్యాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. శతాబ్దాల క్రితం మన పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభ అందరినీ విస్మయానికి గురిచేస్తుందని ఆయన పేర్కొనగా, ఈ అద్భుతాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.