మైనారిటీ పాఠశాలలో డీపీవో కల్పన ఆకస్మిక తనిఖీ నిర్వహణ
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట ప్రభుత్వ మైనారిటీ పాఠశాలను జిల్లా పంచాయతీ అధికారి కల్పన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంటశాలను పరిశీలించి పరిశుభ్రతపై ఆరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, వంటశాల నిర్వహణను పరిశీలించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీపాలా పాల్గొన్నారు.