హెచ్-1బీ వీసాదారులకు అమెరికా ప్రభుత్వం భారీ షాక్

రిపోర్టర్: విజయ్ స్థలం: అమెరికా

అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ వృత్తి నిపుణులకు ఇస్తున్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను రద్దు చేసేందుకు ట్రంప్ సర్కార్ కొత్త నిబంధనను ప్రతిపాదించింది. ఈ నిర్ణయం అమెరికాలోని టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. కొత్త నిబంధన అమల్లోకి వస్తే ఉద్యోగం కోల్పోయిన వారు వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది.