కేరళ విశ్వవిద్యాలయంలో రాజకీయ కార్యకలాపాల నిషేధ ప్రణాళిక నకిలీది

రిపోర్టర్: వెంకట్ స్థలం: కేరళ

కేరళ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలో రాజకీయ కార్యకలాపాలను నియంత్రించేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డ్రాఫ్ట్ ప్రపోజల్ పూర్తిగా నకిలీదని వర్సిటీ స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మోహనన్ కున్నుమల్ స్పష్టతనిస్తూ, క్యాంపస్‌లో నిరసనలు, ప్రచారాలపై ఎలాంటి ఆంక్షలు విధిస్తూ తాము అధికారికంగా ఎలాంటి ముసాయిదా ప్రతిపాదనను సిద్ధం చేయలేదని, ఫేక్ డాక్యుమెంట్‌తో విద్యార్థి సంఘాలను తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు.