గువాహటి రైల్వే స్టేషన్లో భారీ కలకలం: యాభై ఏడుగురు విదేశీయుల అదుపు

రిపోర్టర్: వెంకట్ స్థలం: గువాహటి

గౌహతి కామాఖ్య రైల్వే స్టేషన్లో రైల్వే రక్షణ దళం అధికారులు యాభై ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బ్రహ్మపుత్ర మెయిల్ రైలులో ప్రయాణిస్తున్న ఈ బృందం జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ నుంచి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో అక్రమంగా ప్రవేశించిన విదేశీయులపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నామని, దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి కులేంద్ర నాథ్ దేకా స్పష్టం చేశారు.