బొబ్బిలి పురపాలక ఎన్నికల్లో ఓటుకు నోటు పంపిణీని తీవ్రంగా వ్యతిరేకించిన మువ్వల శ్రీనివాసరావు

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

బొబ్బిలి పురపాలక ఎన్నికల ప్రచారంలో భాగంగా పొదుపు మహిళలకు ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేశారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొగుళ్ల పద్మావతి భర్త మువ్వల శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. అన్యాయంగా పంపిణీ చేసిన ఆ డబ్బులను తాము తీసుకుని స్వామివారి హుండీలో వేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.