ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన

రిపోర్టర్: గోపి స్థలం: Hyderabad

రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని, ఇప్పటివరకు తొంబై రెండు లక్షల నోటీసులు జారీ చేయగా అరవై ఐదు లక్షల మంది సమాధానం ఇచ్చారని సీఈవో సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. నవంబర్ ఐదు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నేరుగా ఇళ్ల వద్దకే బీఎల్వోలు వెళ్లి పత్రాలు సేకరిస్తారని స్పష్టం చేశారు. గడువు మరోసారి పొడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.