మచిలీపట్నంలో భారీ షిప్‌యార్డు ఏర్పాటుకు రక్షణ సంస్థ ప్రతిపాదన

రిపోర్టర్: శివ స్థలం: కృష్ణా జిల్లా

మచిలీపట్నం పోర్టులో భారీ షిప్‌యార్డును నిర్మించేందుకు కేంద్ర రక్షణ రంగ సంస్థ గోవా షిప్‌యార్డు లిమిటెడ్ ముందుకొచ్చింది. మూడు దశల్లో రూ.8 వేల కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందుకు సుమారు 400 ఎకరాల భూమి అవసరమని ప్రభుత్వాన్ని కోరింది. అక్టోబర్ నుంచి డీపీఆర్ తయారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.