అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి భారత్ సిద్ధం: ప్రధాని మోదీ

రిపోర్టర్: సతీష్ స్థలం: India

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి భారత్ సిద్ధంగా ఉందని, బ్రిక్స్ కూటమి ఏ దేశానికీ వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ మెరుగుపరిచేందుకు 10 సూత్రాల రోడ్‌మ్యాప్‌ను ప్రతిపాదించారు. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని, ఏఐ, సైబర్ స్పేస్ రంగాల్లో పరస్పర సహకారం ఉండాలని మోదీ పిలుపునిచ్చారు.