విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులోకి అత్యాధునిక సారిక ఏఐ పరికరం
రిపోర్టర్: విజయ్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌలభ్యం కోసం దక్షిణ కోస్తా రైల్వే ప్రయోగాత్మకంగా సారిక ఏఐ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్లాట్‌ఫాం-1పై ఏర్పాటు చేసిన ఈ వాయిస్ బేస్డ్ టెక్నాలజీ పరికరం ద్వారా బటన్ నొక్కి నోటిమాటతో రైళ్ల సమాచారం కోరవచ్చు. సుమారు 12 భాషల్లో లభించే ఈ సమాచారం తెరపై కూడా ప్రత్యక్షమవుతుండటంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది.