దసరా సెలవుల పొడిగింపు ప్రచారంపై విద్యాశాఖ అధికారుల కీలక స్పష్టత
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
తెలంగాణలో పాఠశాలల దసరా సెలవులను అక్టోబర్ 25 వరకు పొడిగిస్తారంటూ సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి నిజం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పాత షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో అక్టోబర్ 23 శుక్రవారం నాడు పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అనధికారిక వదంతులను నమ్మి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని, విద్యార్థులు అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.