తుమ్మలగుంటలో వైభవంగా సాగిన శ్రీవారి రథోత్సవ వేడుకలు
రిపోర్టర్: రామానుజపల్లి హరిబాబు
స్థలం: తిరుపతి రూరల్
తిరుపతి రూరల్ మండలంలోని తుమ్మలగుంటలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గోవింద నామ స్మరణతో ప్రాంతం మార్మోగింది. రథంపై విహరిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. కళాకారుల ప్రదర్శనలు, మంగళవాయిద్యాల నడుమ భక్తులు ఉత్సాహంగా రథాన్ని లాగారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పించారు.