విద్యుత్ పనుల్లో నిర్లక్ష్యం వద్దు.. బెల్లంపల్లిలో సిబ్బందికి భద్రతా నిబంధనలపై అధికారుల అవగాహన!

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సిబ్బందికి ప్రత్యేక భద్రతా అవగాహన సమావేశం నిర్వహించారు. డీఈ, ఏడీఈల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఏఈలు, సబ్ ఇంజనీర్లు, లైన్మెంట్లు, ఆర్టిజన్లు, స్థానిక ఎలక్ట్రీషియన్లు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి విద్యుత్ పనులు చేపట్టే సమయంలో సిబ్బంది ప్రాణభద్రతకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచించారు. తప్పనిసరిగా సేఫ్టీ కిట్లు ధరించి, ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాలని అధికారులకు, సిబ్బందికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.