ఏలూరు పోలీసుల సత్తా: 10 కోట్ల విలువైన ఫోన్ల రికవరీ

రిపోర్టర్: సురేష్ స్థలం: Eluru, Andhra Pradesh

ఏలూరు జిల్లా పోలీసులు మొబైల్ రికవరీలో రికార్డు సృష్టించారు. తాజాగా 206 ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఇప్పటివరకు మొత్తం 4,266 ఫోన్లను (రూ. 10.66 కోట్ల విలువైనవి) బాధితులకు అందజేశారు. రాష్ట్రంలో రికవరీ శాతం 35% ఉండగా, ఏలూరు జిల్లా 80% రికవరీతో అగ్రస్థానంలో నిలిచి సత్తా చాటింది. బాధితులకు ఫోన్లు తిరిగి అందడంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది.