జంషెడ్పూర్ మాల్లో దుండగుల కాల్పులు నలుగురికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Jamshedpur

జార్ఖండ్లోని జంషెడ్పూర్ నగరంలో ఉన్న బిందాల్ మాల్లో శనివారం మధ్యాహ్నం దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సోనారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్లోని రెస్టారెంట్లో బాధితులు భోజనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. దుండగులు ఏకంగా పదకొండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం టాటా మెయిన్ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ దుర్ఘటన జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.