తెలుగు తెరపై మెగాస్టార్ చిరంజీవి నభూతో ప్రస్థానం పూర్తి చేసుకుందన్న రామ్ చరణ్

రిపోర్టర్: రమేష్ స్థలం: హైదరాబాద్

మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం 48 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన కుమారుడు, నటుడు రామ్ చరణ్ భావోద్వేగంగా స్పందించారు. 1978 సెప్టెంబర్ 22న ప్రారంభమైన ఈ సుదీర్ఘ ప్రయాణం తమ కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని కొనియాడారు. ప్రేక్షకులు అందించిన ఆదరాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. చిరంజీవి సినీ ప్రస్థానం 50 ఏళ్లకు చేరుకునే వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.