రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మరియు సంస్థలకు ఏడు స్కోచ్ అవార్డులు

రిపోర్టర్: గోపి స్థలం: Amaravati

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖలు, సంస్థలు మరియు వినూత్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డులు దక్కినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు. దిల్లీలో నిర్వహించిన 109వ స్కోచ్ అవార్డుల ప్రదానోత్సవంలో వివిధ విభాగాలకు చెందిన ఏడు పురస్కారాలను సంబంధిత అధికారులు అందుకున్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పౌరసంబంధాలు, వ్యర్థాల నిర్వహణ రంగాల్లో చేపట్టిన వినూత్న చర్యలు, పారదర్శక విధానాలకు జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించిందని నిర్వాహకులు వెల్లడించారు.