పేదల సొంతింటి కల సాకారం చేస్తూ లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ పత్రాల అందజేత

రిపోర్టర్: హరి స్థలం: తూర్పు గోదావరి

పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో అర్హులైన 27 మంది పట్టణ లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ పత్రాలను ఆయన స్వయంగా అందజేశారు. అదేవిధంగా మొత్తం 62 మంది లబ్ధిదారులకు రూ.44.30 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. పేదలకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.