విద్యారంగంలో కీలక ఒప్పందం: ఐఐటీ కాన్పుర్ తో బిట్ మెస్రా జట్టు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Ranchi

దేశంలో విద్యా పరిశోధనలను మరింత విస్తరించడానికి ఐఐటీ కాన్పుర్ మరియు బిట్ మెస్రా సంస్థలు ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు విద్యావర్గాలు వెల్లడించాయి. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు, అధ్యాపకులకు అధునాతన పరిశోధనల్ లో నూతన అవకాశాలు లభిస్తాయని బిట్ మెస్రా వైస్ ఛాన్సలర్ ఇంద్రనీల్ మన్నా స్పష్టం చేశారు. జాతీయ అవసరాలకు తగినట్లుగా సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఐఐటీ కాన్పుర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ తెలిపారు.