డీఎస్సీపై సీబీఐ విచారణకు ముందు అక్రమాస్తుల కేసు తేల్చాలంటూ సోమిరెడ్డి సవాల్

రిపోర్టర్: అశోక్ స్థలం: నెల్లూరు

వైకాపాకు సీబీఐపై నమ్మకముంటే జగన్ అక్రమాస్తుల కేసుతో పాటు వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలను అంగీకరించి కోర్టు కౌంటర్లు వెనక్కి తీసుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి డిమాండ్ చేశారు. పకడ్బందీగా జరిగిన డీఎస్సీపై సీబీఐ విచారణ కోరుతున్న వైకాపా నేతలు, ముందుగా రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల కేసును తేల్చాలని శనివారం వీడియో విడుదల చేస్తూ సవాల్ విసిరారు. డీఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని చూసి ఓర్వలేకనే వైకాపా రాద్ధాంతం చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.