పులివెందులలో రీపోలింగ్ నిర్ణయం: జగన్మోహన్ రెడ్డి మరోసారి ఓటు వేస్తారా

రిపోర్టర్: హరి స్థలం: Pulivendula

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వివాదాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పదమూడు పోలింగ్ కేంద్రాల్ లో నవంబర్ రెండవ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి పులివెందులకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంటారా లేదా అనే అంశంపై రాజకీయ వర్గాలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.