'గణపతి ఉత్సవాలు శాంతియుతంగా జరగాలి.. లేదంటే క్రిమినల్ కేసులు': సత్తెనపల్లి సీఐ వార్నింగ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: సత్తెనపల్లి (Sattenapalli)

సత్తెనపల్లి పట్టణంలో గణపతి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు. ముఖ్యంగా లాటరీ టికెట్ల పేరుతో ప్రజలకు టికెట్లు విక్రయించి గిఫ్ట్‌లు అందించే కార్యక్రమాలు చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే నిర్వాహకులపై చట్టపరమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐ గట్టిగా హెచ్చరించారు.