వర్ధన్నపేటలో కిలో గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరి అరెస్ట్
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కట్ర్యాల గ్రామానికి చెందిన ముత్యాల శ్యామ్, వర్ధన్నపేటకు చెందిన పిన్నింటి భరత్ అరకులో సుభాష్ వద్ద గంజాయి కొనుగోలు చేసి విక్రయానికి తెచ్చారు. వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆటోలో తరలిస్తున్న యాభై వేల రూపాయల విలువైన కిలో ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.