ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం.. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు
రిపోర్టర్: kadambari suhasini
స్థలం: గాజువాక
విశాఖపట్నం నగరంలోని 87వ వార్డులో మాజీ కార్పొరేటర్ బోండా జగన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాల విశేషాలను వివరించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.