మైసూరిలో తొమ్మిదేళ్ల బాలిక అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష

రిపోర్టర్: హరి స్థలం: Mysuru

మైసూరిలోని పోక్సో ప్రత్యేక కోర్టు తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన కార్తీక్ అనే ముప్పై రెండేళ్ల దోషికి మరణశిక్ష విధించినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. గత ఏడాది అక్టోబరులో రోడ్డు పక్కన గుడారంలో నిద్రిస్తున్న చిన్నారిని అపహరించి కిరాతకంగా 27 కత్తిపోట్లతో హత్య చేసినట్లు ప్రత్యేక పీపీ కేబీ జయంతి కోర్టులో నిర్ధారించారు. నగర పోలీసులు పట్టుకున్న ఈ కేసులో కేవలం ఏడాదిలోనే సంచలన తీర్పు వెలువడింది.