వలస కూలీల ఓట్లను తొలగించొద్దంటూ కావలి ఆర్డీవోకు వినతి

రిపోర్టర్: నరేష్ స్థలం: కావలి

సర్ పేరిట వలస కూలీల ఓట్లను తొలగించొద్దని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి డిమాండ్ చేశారు. కావలి ఆర్డీవో కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించి ఆయన ఇన్ఛార్జి ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. ఉదయగిరి నియోజకవర్గంలో 56 వేలు, కావలిలో 31 వేల ఓట్లు పెండింగ్లో పెట్టారని మల్లి తెలిపారు. ఉపాధి కోసం ఇతర నగరాలకు వలస వెళ్లిన కూలీల ఓట్లు తొలగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.