మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసిన వంగవీటి రాధాకృష్ణ

రిపోర్టర్: సతీష్ స్థలం: మంగళగిరి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాబోయే స్థానిక ఎన్నికలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే, పవన్ కల్యాణ్ చేపట్టిన శాఖా పరమైన సంస్కరణలను రాధాకృష్ణ అభినందించారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.