వీధి వ్యాపారుల ఆర్థిక భద్రత కోసం కొత్తగా పీఎం స్వనిధి క్రెడిట్ కార్డ్

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎం స్వనిధి క్రెడిట్ కార్డ్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని కేంద్ర అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక లైఫ్టైమ్ ఫ్రీ కార్డు ద్వారా చిన్న వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు. మొదట పది వేల రూపాయల వరకు రుణం లభిస్తుందని, వ్యాపారం సాగే కొద్దీ ముప్పై వేల వరకు పెంచుకోవచ్చని వివరించారు. ఇరవై నుంచి యాభై రోజుల వరకు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.